తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (TGSRTC) పరిధిలో ఎలక్ట్రిక్ బస్సుల డ్రైవర్లుగా పనిచేయాలనుకునే వారికి ఉద్యోగ అవకాశం అందుబాటులోకి వచ్చింది. గ్రీన్ మెట్రో ఎలక్ట్రిక్ బస్సుల కోసం అనుభవం ఉన్న డ్రైవర్ల నియామకానికి వాక్-ఇన్ ఇంటర్వ్యూలు నిర్వహిస్తున్నారు.
ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు కనీసం 10వ తరగతి పాస్ అయి ఉండాలి. అలాగే హెవీ మోటార్ వెహికల్ (HMV) డ్రైవింగ్ లైసెన్స్ తప్పనిసరిగా కలిగి ఉండాలి. అభ్యర్థులకు కనీసం 18 నెలల హెవీ వెహికల్ డ్రైవింగ్ అనుభవం ఉండాలి.
జీతం ఎంతంటే?
ఎంపికైన డ్రైవర్లకు నెలకు ₹26,000 వరకు జీతం చెల్లించనున్నట్లు పేర్కొన్నారు. ఉద్యోగంతో పాటు ESI, మెడికల్ సదుపాయం, యూనిఫాం, ఇతర ప్రయోజనాలు కూడా కల్పించనున్నట్లు సమాచారం.
ఎక్కడ ఇంటర్వ్యూ?
హైదరాబాద్లోని కూకట్పల్లి, కంటోన్మెంట్ తదితర డిపోలలో నడుస్తున్న ఎలక్ట్రిక్ బస్సుల కోసం డ్రైవర్లను ఎంపిక చేయనున్నారు. అర్హత ఉన్న అభ్యర్థులు ప్రతి పని దినం ఉదయం 10 గంటల నుంచి కూకట్పల్లి TGSRTC డిపోలో జరిగే వాక్-ఇన్ ఇంటర్వ్యూకు హాజరుకావచ్చు.
అభ్యర్థులు తీసుకెళ్లాల్సినవి
ఇంటర్వ్యూకు హాజరయ్యే సమయంలో ఆధార్ కార్డు, HMV డ్రైవింగ్ లైసెన్స్, డ్రైవింగ్ అనుభవ ధ్రువీకరణ పత్రం, రెండు పాస్పోర్ట్ సైజ్ ఫొటోలు తప్పనిసరిగా వెంట తీసుకెళ్లాలి.
ఈ ఉద్యోగ అవకాశానికి సంబంధించి మరిన్ని వివరాల కోసం Eveytransts@eveytrans.com ఇమెయిల్ ద్వారా లేదా కింది నంబర్లలో సంప్రదించవచ్చు.
Ravi – 9154992575
Srikanth – 70755 15042
Vishal – 96768 76055