October 3, 2026

ఏపీ మహిళలకు గుడ్ న్యూస్.. అంగన్వాడీ ఉద్యోగాలకు దరఖాస్తులు ప్రారంభం!

ఆంధ్రప్రదేశ్‌లో అంగన్వాడీ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న మహిళలకు ఇది మంచి అవకాశం. తిరుపతి అర్బన్ ICDS ప్రాజెక్ట్ పరిధిలోని పలు అంగన్వాడీ కేంద్రాల్లో ఖాళీగా ఉన్న అంగన్వాడీ కార్యకర్త, సహాయకురాలి పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానించారు.

ఈ ఉద్యోగాలకు రాత పరీక్ష లేకుండా ఎంపిక ప్రక్రియ చేపట్టనున్నట్లు అధికారులు తెలిపారు.

ఖాళీల వివరాలు

అంగన్వాడీ కార్యకర్త – 5 పోస్టులు

సప్తగిరి నగర్, వేషాలమ్మ టెంపుల్, శ్రీ రాఘవేంద్ర నగర్, కొర్లగుంట, పులస వీధి కేంద్రాల్లో పోస్టులు ఖాళీగా ఉన్నాయి.

అంగన్వాడీ సహాయకురాలు – 10 పోస్టులు

నెహ్రు నగర్, మంగళం-1, అశోక్ నగర్, ఆటోనగర్, మల్లయ్య గుంట కట్ట, కొర్లగుంట-4, 5, సప్తగిరి కాలనీ, మారుతీ నగర్, మిట్ట గాంధీపురం తదితర ప్రాంతాల్లో ఖాళీలు ఉన్నాయి.

ఎవరు దరఖాస్తు చేసుకోవచ్చు?

  • మహిళా అభ్యర్థులు మాత్రమే దరఖాస్తు చేసుకోవాలి.
  • కనీసం 10వ తరగతి ఉత్తీర్ణత ఉండాలి.
  • వయస్సు 18 నుంచి 35 సంవత్సరాల మధ్య ఉండాలి.
  • సంబంధిత గ్రామం లేదా వార్డులో స్థానికంగా నివసించే మహిళలు అర్హులు.

దరఖాస్తు చివరి తేదీ

అర్హత ఉన్న అభ్యర్థులు ఆగస్టు 15వ తేదీ వరకు తిరుపతి అర్బన్ ICDS కార్యాలయంలో దరఖాస్తులు సమర్పించాలి.

Application PDF: Click Here

కాబట్టి అర్హత ఉన్న మహిళా అభ్యర్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని, పూర్తి వివరాల కోసం తిరుపతి అర్బన్ ICDS ప్రాజెక్ట్ కార్యాలయాన్ని సంప్రదించండి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *